శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు
NEWS Mar 07,2025 08:14 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 58 వేల 548 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 297 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతుందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.