జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీ
NEWS Mar 06,2025 01:29 pm
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం, అభివృద్ధి, వేతనాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి కొత్త పాలసీ తీసుకు రావడానికి కృషి చేస్తామన్నారు. JCHSL ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ సొసైటీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా జర్నలిస్టులను ఆమె సన్మానించారు.