జగిత్యాల జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
NEWS Mar 06,2025 03:51 pm
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( మార్చి 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు, శాంతిభద్రతలకు భంగం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.