బాన్స్వాడలో టీచర్ ఎమ్మెల్సీ గెలుపు సంబరాలు
NEWS Mar 06,2025 09:35 pm
ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా బాన్సువాడలోని దేశాపేట్ SRNK డిగ్రీ కాలేజీలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు వందనం కార్యక్రమం నిర్వహించారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.