పవన్ కళ్యాణ్‌కు రుణపడి ఉంటా
NEWS Mar 06,2025 12:38 pm
జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయిన కిరణ్ రాయల్ సంచలన కామెంట్స్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తాను మరిచి పోలేనని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. కావాలని కొందరు తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిజం నిలకడ మీద తేలుతుందన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, తాను సహకరించడం జరిగిందన్నారు. తనను నమ్మి పార్టీ ఇంఛార్జ్ పోస్టు ఇచ్చారని తెలిపారు. అందుకే తనకు పవన్ అంటే ఇష్టమన్నారు.