కర్ణాటక డీజీపీ కూతురు, నటి రన్యా రావుకు 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. దుబాయ్ నుంచి అక్రమంగా 14.8 కేజీల బంగారాన్ని తీసుకు వస్తుండగా కెంపెగౌడ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల కస్టడీ విధించింది నటి రన్యా రావుకు. ఆమె అరెస్ట్ తో ఒక్కసారిగా కన్నడ చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కాగా గత కొంత కాలం నుంచి బెంగళూరు నుంచి దుబాయ్ కి పలుమార్లు వెళ్లినట్లు విచారణలో తేలింది.