ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ తనను బెదిరించే ధోరణిలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదంటూ లేఖ రాశారంటూ మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉన్న తను ఇలా పేర్కొనడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది శాసన సభ రూల్స్ ఆధారంగా నిర్ణయించడం జరుగుతుందన్నారు.