కన్నడ సినీ నటి రన్యా రావును బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 14.8 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆఫీసర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె తరుచూ బెంగళూరు నుంచి దుబాయ్ కు ప్రయాణం చేస్తూ వస్తోందని తెలిపారు. కాగా రన్యా రావు కర్ణాటకలో పని చేస్తున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ కు దగ్గరి బంధువు అని పేర్కొన్నారు. నటి అరెస్ట్ వార్త శాండిల్ వుడ్ లో కలకలం రేపింది.