'సకాలంలో పన్నులు చెల్లించాలి'
NEWS Mar 04,2025 07:51 pm
మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఇంటి పన్ను, నల్ల బిల్లు, ట్రేడ్ లైసెన్స్ తదితర వాటిని సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత సూచించారు. మెట్‌పల్లి పట్టణంలో మంగళవారం పర్యటించిన ఆమె పన్నుల చెల్లింపులను, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ మోహన్, టీపీవో రాజేంద్రప్రసాద్, రెవెన్యూ ఆఫీసర్ మీర్జా అజ్మతుల్లా బేగ్ తదితరులు ఉన్నారు.