చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. గత ఆరు నెలలుగా తన భర్త పై లేనిపోని ఆరోపణలు చేస్తూ వస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు తనపై లేనిపోని విమర్శలు చేయడం దారుణమన్నారు. చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరకు తాను ఆదారాలు తీసుకుని వస్తానని, నీకు దమ్ముంటే రావాలని పిలుపునిచ్చారు. తాను నీ సతీమణికి సంబంధించిన ఆస్తుల వివరాలు తీసుకు వస్తానని అన్నారు.