నగలు, నగదు బ్యాగు బాధితులకు అప్పగింత
NEWS Mar 03,2025 11:42 pm
మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన సుందరగిరి అఖిల్ గౌడ్ అతని భార్య మెట్‌పల్లికి బైక్ పై వచ్చే క్రమంలో బ్యాగు మార్గ మధ్యలో పడిపోయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాగు కోసం వెతుకుతుండగా, అబ్దుల్ రహీం అనే వ్యక్తికి బ్యాగు దొరకడంతో పోలీసులకు అప్పగించాడు. బ్యాగులో 2 తులాల బంగారు చైన్, ఒక ఉంగరం, 50వేల నగదు ఉండగా ఆ బంగారంను, నగదును స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అప్పగించిన రహీంను పోలీసులు అభినందించారు.