డెకరేషన్ యూనియన్ అధ్యక్షునిగా రాజారాం
NEWS Mar 03,2025 11:22 pm
మెట్‌పల్లి పట్టణంలోని డెకరేషన్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. నూతన అధ్యక్షులుగా ఊరే రాజారాం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సదక్, ప్రధాన కార్యదర్శిగా గుంటుక చిన్నయ్య, కార్యదర్శి బారాడి శ్రావణ్, కోశాధికారిగా కట్టెకోల మహేందర్, ప్రచార కార్యదర్శిగా ఎనుగందుల విజయ్, కార్యవర్గ సభ్యులుగా గుండవేని ప్రణయ్, ఎస్‌కే సలీం, ఎండి జాకీర్, మణిదీప్, నరేష్, మధు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఘనంగా శాలువతో సన్మానించారు.