చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్
NEWS Mar 03,2025 02:15 pm
అంతర్రాష్ట్ర దొంగ సయ్యద్ హమీద్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 27 న శివరాత్రి పండగ రోజున పట్టపగలే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, గంగస్థాన్ ఫేస్ 3 ఏకశిలా నగర్, ప్రాంతాలలో తాళాలు వేసిన ఇళ్లకు కన్నం వేశాడు. రూ.3.20,000 నగదు, 19 తులాల బంగారం, 500 గ్రాముల వెండి దోచుకెళ్ళాడని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.