కేసీఆర్ ను తిట్టడం తప్ప సీఎం చేసిందేమిటి..?
NEWS Mar 03,2025 09:50 am
మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి పొద్దస్తమానం కేసీఆర్ ను తిట్టడమే తప్ప ప్రజలకు పనికి వచ్చే ఒక్క పనైనా చేశాడా అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు, ఆధారాలు లేని ఆరోపణలు, చిల్లర రాజకీయాలు చేయడం పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు 36 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి వచ్చాడని, రాష్ట్రానికి సంబంధించి ఒక్క పైసా కూడా తీసుకు రాలేక పోయాడని ఎద్దేవా చేశారు. ఇక నుంచి పాలనా పరంగా ఫోకస్ పెడితే మంచిదని హితవు పలికారు