కృష్ణవేణి జీవితం చిరస్మరణీయం
NEWS Mar 03,2025 09:41 am
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, నటిగా విశిష్ట సేవలు అందించిన కృష్ణవేణి జీవితం చిరస్మరణీయమని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో కృష్ణవేణి సంస్మరణ సభ నిర్వహించారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. 101 ఏళ్లు బతికారని, ఎందరికో జీవితాలను ఇచ్చారని ప్రశంసించారు. కృష్ణవేణి లేని లోటు పూడ్చ లేనిదన్నారు .