10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
NEWS Mar 02,2025 06:01 pm
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 10వ తరగతి పరీక్షలపై సమీక్ష చేపట్టారు. ఈనెల 21 నుంచి జరిగే పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. ఎండా కాలం కావడంతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచు కోవాలని సూచించారు.