సక్సెస్ కు షార్ట్ కట్స్ లేవు
NEWS Mar 01,2025 04:06 pm
ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సక్సెస్ కు షార్ట్ కట్స్ లేవని అన్నారు. వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. తాను జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఈ స్థాయికి రావడానికి చాలా కష్ట పడ్డానని చెప్పారు. గమ్యాన్నే కాదు గమ్యం కోసం మనం నడిచే మార్గాన్ని కూడా ప్రేమించాలన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, మోడీ ఇలా ఎందరో ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చిన వారేనని ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నారు.