ఢీ షో డ్యాన్సర్ మోసం..యువతి ఆత్మహత్య
NEWS Mar 01,2025 03:50 pm
ఢీ షో డ్యాన్సర్ అభి తనను మోసం చేశాడంటూ ఖమ్మం జిల్లా పొన్నెకల్లుకు చెందిన కావ్య కళ్యాణి ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుని ఈ ఘటనకు పాల్పడింది. తన చావుకు ఢి షో డ్యాన్సర్ కారణమని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిసిందని, దీనిని తట్టుకోలేక తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో అభిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.