జెలెన్ స్కీ పై ట్రంప్ ఫైర్
NEWS Mar 01,2025 03:35 pm
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్. తాను శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నానని, వినిపించుకోక పోతే ఎలా అంటూ మండిపడ్డారు. దీంతో ఇద్దరు నేతలు మీడియా ముందే అరిచేంత పని చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో తట్టుకోలేక జెలెన్ స్కీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లి పోయాడు. అమెరికా ఆధిపత్య ధోరణితో ఉందన్నాడు. తమకంటూ ఓ దేశం ఉందని, దానికి మద్దతు ఇవ్వక పోతే ఎలా అని జెలెన్ స్కీ ప్రశ్నించాడు.