దేశాన్ని కాపాడడంలో రక్షణ శాఖ కీలకం
NEWS Feb 28,2025 03:40 pm
దేశాన్ని కాపాడడంలో రక్షణ శాఖ కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. దేశ రక్షణ బాధ్యత యువతపై ఉందన్నారు. మిస్సైల్స్ తయారీ చేసే పరిశ్రమలు డీఆర్డీఎల్, బీడీఎల్, డీఆర్డీవో, మిథాని..మన దగ్గర ఉండడం సంతోషం అన్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరారు.