మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. చంద్రశేఖర్ గౌడ్ ను బెదిరించాడనే ఆరోపణలపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైన తన అనుచరులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు సంగారెడ్డికి చెందిన సామాజిక కార్యకర్త చక్రధర్ గౌడ్. బాధితుడి ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.