పోసాని కృష్ణ మురళిపై 14 కేసులు
NEWS Feb 28,2025 09:53 am
నటుడు పోసాని కృష్ణ మురళిపై 14 కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దళితుల్ని కించ పరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా పోసాని వ్యాఖ్యలు చేశారని పోలీసులు వెల్లడించారు. రాజకీయ నాయకుల్ని,వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. విచారణకు సహకరించ లేదన్నారు.