NGKL: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. సింగోటంలో జరిగే ఉత్సవాల పాల్గొన్న అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వెలమ ఫంక్షన్ హాల్లో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో జరిగే బీసీ కుల సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.