హిందీ..సంస్కృతాన్ని ఒప్పుకోం
NEWS Feb 27,2025 06:22 pm
హిందీ, సంస్కృత భాషలను ఎట్టి పరిస్థితులలో అమలు చేయబోమంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం ఎంకే స్టాలిన్. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా వీటి అమలుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హిందీ భారతదేశం లోని చాలా భాషలను మింగేసిందన్నారు. భోజ్పురి, మైథిలి, అవధి,బ్రజ్, బుందేలి, గర్వాలీ, కుమౌనీ, మగహి, మార్వారీ,మాల్వీ, చత్తీస్గరీ, సంతాలి, ముండారి, మరెన్నో భాషలు ఊపిరాడని స్థితిలో తమ మనుగడ కోసం పరితపిస్తున్నాయన్నారు హిందీని ఏకైక జాతీయ అధికార భాషగా చేసే ప్రయత్నం మరెన్నో మాతృభాషల ఊపిరి తీసేస్తోందన్నారు. మాతృ భాషలను మింగేసే దేనిని ఒప్పుకోమన్నారు.