డైరెక్టర్ రాజమౌళిపై ఫ్రెండ్ ఫైర్
NEWS Feb 27,2025 01:13 pm
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేశారు తన స్నేహితుడు యు. శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించ లేక పోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ కూడా రాశారు. తనతో 34 ఏళ్ల స్నేహం ఉందన్నాడు. యమదొంగ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశానని తెలిపాడు. సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపించాడు. వీటి ఆధారంగా సుమోటో కేసు నమోదు చేయాలంటూ కోరాడు. అంతే కాదు తనకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని సూచించాడు.