నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా
NEWS Feb 26,2025 05:45 pm
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందని వాపోయారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఎక్కడికీ పోలేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలు వేశారని, తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సెక్షన్ 353(2),192,318(2),318(4) బి.ఎన్.ఎస్ కింద్ కేసు నమోదు చేశారు.