నన్ను అరెస్ట్ చేసేంత సీన్ లేదు
NEWS Feb 26,2025 05:21 pm
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను దుబాయ్ లో అరెస్ట్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇదంతా పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. అవన్నీ రూమర్స్ అని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ మణికొండలోని ఇంట్లో ఉన్నానని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరారు. తెలంగాణ ప్రజలు, తాండూరు వాసులకు శివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.