వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే
NEWS Feb 26,2025 03:40 pm
టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2026లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. చరిత్ర తిరగ రాస్తామని చెప్పారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడు బహిరంగ సభలో ప్రసంగించారు. పెత్తందారులు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని, తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుస్తాం..సామాన్యులకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు.1967లో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని, రాబోయే రోజుల్లో అదే రిపీట్ కాబోతోందన్నారు.