శ్రీశైలం భక్త జన సందోహం
NEWS Feb 26,2025 09:23 am
మహా శివ రాత్రి పర్వదినం సందర్బంగా శ్రీశైల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత భక్తజనం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎటు చూసినా శివ నామ స్మరణతో మారుమ్రోగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి, అమ్మ వార్లకు విశేష పూజలు చేపట్టారు. లోక కళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలు చేపడుతున్నారు.