యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్
NEWS Feb 25,2025 08:49 am
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన కేసుకు సంబంధించి యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది. తన కారణంగా నష్ట పోయానంటూ బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 111(2) చీటింగ్, 112(1)పెట్టీ కేసు, 318(4) ఎలక్ట్రానిక్ పోర్జరీ, 319(2) పర్సనల్ చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66 C, 66D, AP గేమింగ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనెల 21న యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్నారు.