స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఫామ్ లేమితో బాధ పడుతున్న తను దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో చెలరేగి పోయాడు. 111 బంతులు ఎదుర్కొని అజేయంగా 100 రన్స్ చేశాడు. తనకు ఇష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని , ఇదే తనకు బలహీనతగా మారిందని వాపోయాడు. ఈ షాట్ ను ఆడేందుకు ప్రయత్నం చేసినప్పుడల్లా తాను క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాల్సి వస్తోందన్నాడు.