జగన్ దమ్మున్నోడు - ఆర్కే రోజా
NEWS Feb 24,2025 06:43 pm
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. జగన్ ఎంత ధైర్యవంతుడో రాష్ట్రంలో చిన్ని పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, తను మొండిఘటం ఆ విషయం పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. జగన్ భయపడే రకం కాదని, ఇంకా కావాలంటే సోనియా గాంధీ, చంద్రబాబులను అడిగితే తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష హోదాపై తలా తోకా లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.