ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తన వద్ద కావలికార్లు లాగా పని చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆయన ఏది చెబితే అది చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేకు అధికారులు, పోలీసులు ఇంతలా భయపడటం తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. పెబ్బేర్ మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా అన్నారు.