ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్
NEWS Feb 24,2025 01:27 pm
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇవాళ కాక పోతే రేపు నీ తల నరికి వేస్తామంటూ కాల్స్ వచ్చాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో తనను అప్రమత్తం చేశారు. రాజా సింగ్ ఈ మధ్యన సంచలనంగా మారారు. దేశం కోసం , ధర్మం కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.