మందు దుకాణాలు బంద్
NEWS Feb 24,2025 01:27 pm
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు.ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.