జాకారం పెట్రోల్ బంకులో కనీస మౌలిక సదుపాయాలు లేక అక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కెవిపిఎస్ మండల కార్యదర్శి జనరేంద్ర అన్నారు. జాకారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఎదురుగా ఉన్న హెచ్ పీ పెట్రోల్ బంకులో పని చేస్తున్న కార్మికులను పట్టించు కోవడం లేదన్నారు. బంకులో పనిచేస్తున్న వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.