నీరా కేఫ్ ను తరలిస్తే జాగ్రత్త
NEWS Feb 23,2025 05:07 pm
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను చాట్ భండార్ లాగా మార్చేశారంటూ మండిపడ్డారు. నీరా కేఫ్ ను ఎత్తేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆయన కేఫ్ ను సందర్శించారు. నీరా కేఫ్ రూపు రేఖలు మార్చడం పట్ల మండిపడ్డారు. అంతరించి పోతున్న నీరాను పునరుద్దరించడం జరిగిందని, గౌడ కులస్తుల, వృత్తి పని వారికి ఆత్మ గౌరవం కల్పించేలా చేశామన్నారు. నీరా కేఫ్ ను తరలిస్తే ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.