విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం
పెద్దాపూర్ గురుకులంలో నిద్ర
NEWS Feb 22,2025 06:22 pm
మెట్‌పల్లి: పెద్దాపూర్ గురుకుల పాఠశాలను శనివారం రాత్రి కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సందడి చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రాత్రి పాఠశాలలోనే కలెక్టర్ బస చేశారు.