కాంగ్రెస్ లోనే కొనసాగుతాం
NEWS Feb 22,2025 05:12 pm
తాము ఎక్కడికీ వెళ్లడం లేదని, పార్టీ మారడం లేదంటూ స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల ఇద్దరూ కాంగ్రెస్ ను వీడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ఖండించారు.