సింహ వాహనంపై సోమ స్కంద మూర్తి
NEWS Feb 22,2025 10:36 am
తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వర స్వామి వారు కామాక్షి అమ్మ వారి సమేతంగా సోమ స్కంద మూర్తిగా సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది.