వారణాసిలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
NEWS Feb 19,2025 10:50 am
మహా కుంభమేళా సందర్భంగా వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని బిర్లా మందిర్ లో శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యహ వచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని చేపట్టారు.