జగన్ కు ఎన్నికల కోడ్ వర్తించదు
NEWS Feb 19,2025 09:49 am
మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో మిర్చి యార్డ్ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ సాకు చెబుతున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని, ప్రచారం చేయడం లేదని, కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడడం లేదన్నారు. జగన్ టూర్ కు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. మాజీ సీఎంకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు.