విశిష్ట సేవలు అందించిన జెన్నీ పోలీస్ శునకానికి ఘనంగా వీడ్కోలు పలికారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. సాయుధ దళం కార్యాలయంలో పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. 11 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో సేవలు అందించింది. పోలీసు విధుల్లో జెన్నీ చేసిన సేవలు అద్భుతమన్నారు ఎస్పీ. శునకానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. పలు కేసుల్లో జెన్నీ సహకారం మరువ లేనిదన్నారు. ఈ శునకం నవంబర్ 15, 2013న పుట్టింది. ఇది గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందినది. హైదరాబాద్ లోని మొయినాబాద్ లో ఎక్స్ ప్లోజివ్ విభాగంలో 8 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకుందన్నారు.