కేసీఆర్ ను తిరిగి సీఎంను చేసేంత దాకా తాము నిద్ర పోయే ప్రసక్తి లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బర్త్ డే సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ కు మనం ఇచ్చే అరుదైన బహుమానం ఏమిటంటే తనను సీఎం చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు కేటీఆర్. జనంలో ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఎన్నుకుని తప్పు చేశామని ఫీల్ అవుతున్నాన్నారు.