హైదరాబాద్ లో మరోసారి మందు పార్టీ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్‌లో పోలీసులు సోదాలు చేపట్టారు. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. డ్రగ్స్, నార్కోటిక్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు.