బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడడంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా తనకు విషెస్ తెలియ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మాజీ సీఎం కేసీఆర్.