అలనాటి సినీ నటి, నిర్మాత కృష్ణవేణి కన్ను మూశారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా దివంగత నందమూరి తారక రామారావును ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి. మీర్జాపురం రాజాతో కృష్ణవేణి ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.