నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను
NEWS Feb 15,2025 01:01 pm
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కొందరికి నచ్చక పోవచ్చని, మరికొందరు అంగీకరించక పోవచ్చన్నారు. తనను ప్రశ్నించే పరిస్థితి తాను తెచ్చుకోనని అన్నారు. పార్టీ పరంగా ప్రజలకు హామీ ఇచ్చింది తానేనని, అమలు చేయక పోతే అడిగేది తననేనని చెప్పారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. అదంతా మీడియా సృష్టేనని అన్నారు.