నాపై పార్టీ ముద్ర వేయకండి
NEWS Feb 15,2025 12:34 pm
ప్రముఖ సింగర్ మంగ్లీ తీవ్రంగా స్పందించారు. అరసవల్లి టెంపుల్ వివాదంపై లేఖ రిలీజ్ చేశారు. దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పాటలు పాడానని, 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశానని తెలిపారు. వైసీపీకి మాత్రమే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానని అన్నారు మంగ్లీ. ఇప్పటికీ తనపై వైసీపీ ముద్ర పోవడం లేదన్నారు. గత ఏడాది నుంచి పార్టీలకు పాటలు పాడ కూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.