మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే తను జైలుకు వెళ్లాడని అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. తనపై విచారణకు ఆదేశించామన్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని, తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పక అమలు చేస్తామన్నారు.